Editorial | విఫల ప్రయోగంగా డోజ్

Editorial | విఫల ప్రయోగంగా డోజ్
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం నాటి నుంచి తీసుకున్న నిర్ణయాలు, చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచే కాకుండా, అమెరికన్ల నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వంలో వ్యయాన్ని తగ్గించేందుకు ఆయన తన మిత్రుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)ని ఏర్పాటు చేశారు.
వివేక్ రామస్వామిని కూడా ఈ విభాగానికి అధిపతిగా నియమించారు. ఈ విభాగానికి వివేక్ రామస్వామి అనే ప్రవాస భారతీయుణ్ణి సంయుక్త సారధిగా నియమించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో పెక్కింటిని మస్క్ వ్యతికించారు.. వాటిలో ట్రంప్ తీసుకుని వచ్చిన బిగ్ బ్యూటీఫుల్ ముఖ్యమైనది.
ఒకవిధంగా చెప్పాలంటే ఈ బిల్లు ట్రంప్ మానస పుత్రిక. దీనిని వ్యతిరేకించడంతో ట్రంప్‌కీ, మస్క్‌కీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎలాన్ మస్క్ వైదొలగడానికి ఇదే ముఖ్య కారణం. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్స వాన్ని 2026లో జరుపుకోనున్నారు.
ఆనాటికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తాననీ, అందుకు వీలుగా డోజ్ పని చేస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ శాఖల్లో సమూల మార్పులు తీసుకుని రావడం, వృధా ఖర్చులను తగ్గించడం వంటి ముఖ్యమైన సంస్కరణలను తీసుకుని రావడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుందని కూడా ఆయన ప్రకటించారు.
అయితే,ఆయన అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. డోజ్ వల్ల ఖర్చులు తగ్గడం కాదు, మరిన్ని పెరిగిపోయాయి. ప్రభుత్వ సిబ్బంది, అధికారులలో అసంతృప్తి మరింత పెరిగింది. ట్రంప్ ఏదో ఉద్ధరిస్తారని ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశ ఎదురైంది. వివిధ శాఖలలో ప్రక్షాళన పేరిట వేలాది మందిని తొలగించారు.
దాంతో ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలు నగరాల్లో వారు నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. దీంతో మొదట రామస్వామి డోజ్ నుంచి వైదొలగారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లుతో మస్క్ వైదొలిగారు. వెళ్ళే ముందు ఆయన ట్రంప్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రతిగా మస్క్‌పై ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేశారు.
వీరిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలను ప్రజలు దాదాపుగా మరిచిపోయిన సమయంలో ఇప్పుడు డోజ్ విభాగాన్ని మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డోజ్ విభాగా నికి ప్రభుత్వం ప్రత్యేకంగ నిధులు కేటాయించలేదు. వివిధ శాఖల నుంచి తీసుకుని వచ్చిన ఉద్యోగులకు వేతనాలు కూడా సరిగ్గా అందలేదు.
ట్రంప్ యంత్రాంగాన్ని మస్క్ వెనుక నుండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో మస్క్ ప్రభుత్వో ద్యోగి కాదనీ, కేవలం సలహాదారుడు మాత్రమేనని ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎలాన్ మస్క్ సొంత సంస్థ టెస్లాకు నిధులు మళ్ళిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వివిధ నగరాల్లో టెస్లా సంస్థ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
అలాగే, డోజ్కి వ్యతిరేకంగా వివిధ నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. టెక్సాస్, అరిజోనా, సెయింట్ లూయీస్, న్యూయార్క్, డెటెన్, ఓహియో, కాలిఫో ర్నియా తదితర నగరాలో డోజ్కి వ్యతిరేకంగా ప్రదర్శ నలను ఉద్యోగులు నిర్వహించారు. టెస్లా కార్ల యజ మానులు తమ వాహనాలను ధ్వంసం చేశారు.
ట్రంప్, మస్క్లపై ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యా యి. దీంతో అమెరికన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలెప్ మెంటు సహా, ప్రభుత్వ విభాగాలను మూసివేశారు. ఈ చర్యలు అమెరికా బడ్జెట్‌ను నియంత్రించడానికి మాత్రమే ఉపయోగపడతాయని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారత్‌లో ఎన్నికలలో 183 కోట్లు ఖర్చు చేసేందు కు ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను డోజ్ తిరస్క రించింది. దీనిపై భారతీయులలో కూడా వ్యతిరేకత వచ్చింది. వివిధ దేశాల ఆంతరంగిక వ్యవహారాలో జోక్యా నికి సంబంధించిన చర్యలకు డోజ్ వ్యతిరేకత తెలిపింది. స్వదేశంలోనే కాకుండా,విదేశాల్లోనూ డోజ్ పట్ల తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఈ విభాగాన్ని మూసివేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
డోజ్ నిర్ణయాల వల్ల నిరుద్యోగులైన వారు ఇప్పుడు వీధిన పడ్డారు. వారంతా ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. హెచ్1బీ వీసాల విషయంలో ఆయన విధించిన ఆంక్షలు వాటిలో ఒకటి.
ట్రంప్ స్వదేశంలో పాలనపై దృష్టి పెట్టకుండా భారత్- పాక్ యుద్ధాన్ని ఆపించాను, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఆపించానంటూ గొప్పలు చెప్పుకుంటూ రోజులు వెళ్ళదీస్తున్నారు. నిజానికి ఈ యుద్ధాల విరమణ లో ఆయన ప్రమేయం ఏమీ లేదు. అక్కడి పరిస్థితులే కారణం. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ట్రంప్ స్వదేశంలో పాలననుమెరుగు పర్చుకోవాలని అమెరికన్లే కోరుతున్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు జేయాలని కోరుతున్నారు.
