Ditwah cyclone | అన్నదాతల ఆందోళన..

Ditwah cyclone | అన్నదాతల ఆందోళన..

Ditwah cyclone

Ditwah cyclone | గూడూరు, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాను ప్రభావం వలన వాతావరణం మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం వరకు గంటకు రూ.4,000 ఉన్న వరి కోత మిషన్ల ధరలను మధ్య దళారులు అమాంతం పెంచారు. రాత్రి సమయంలో కోసేందుకు మిషన్ యజమానులు గంటకు రూ.5,000 డిమాండ్ చేస్తున్నారు.

Ditwah cyclone |రైతుల తీవ్ర ఆందోళన

చేసేది లేక, నష్ట భయం కారణంగా రైతులు ఎక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దీంతో రైతుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హడావుడిగా హార్వెస్టర్లతో కోత కోయడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించినప్పటికీ రైతులు ఆందోళన చెంది హార్వెస్టర్లతో అధిక సొమ్ము చెల్లించి కోతలు కోయడం జరుగుతుంది.

Leave a Reply