జనసేన ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

జనసేన ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేతుల మీదుగా 10 ఆటోలు పంపిణీ
సామాజిక సేవలో ముందున్న అమ్మిశెట్టి ట్రస్ట్

విజయవాడ, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలు నిర్వహణ తో పాటు అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఆటోల పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఆటోలు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అందజేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఉగాది ప్రతి కుటుంబానికి ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఆటో కార్మికులకు జీవనోపాధి కల్పించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply