నిత్యవసర సరుకులు అందజేత

నిత్యవసర సరుకులు అందజేత

పాయకాపురం,ఆంధ్ర ప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రికలో గల ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో అన్వర్ భాష ఆధ్వర్యంలో 64,63,57, వైయస్సార్ కాలనీ, మీనాక్షి నగర్ ప్రాంతాలకు చెందిన పలువురికి నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. కె.నాగుల్ మీరా పాల్గొని పలువురు ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా షేక్ సాజిద్ అలీ, రాష్ట్ర అధికార ప్రతినిధి సిలార్ బేగ్, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ వలి, నగర ఉపాధ్యక్షులు షేక్ బాషా ,మొహమ్మద్ రఫీ వైయస్సార్ కాలనీ మహిళా అధ్యక్షురాలు షేక్ నసీమా, 64 డివిజన్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ రుహుల్లా, మహమ్మద్ షఫి, మీనాక్షి నగర్ అధ్యక్షులు షేక్ షాభాషి, తదితర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply