భారత వైఖరి స్పష్టంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK), ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు ఉంటాయని, ఇతర అంశాలపై చర్చలపై ఆసక్తి లేదని పేర్కొంది.
ఈ నెల 7న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడుల తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓకు సమాచారం అందించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నప్పటికీ పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని వెల్లడించింది.
అయితే, మే 10న కాల్పుల తీవ్రత పెరిగిన తర్వాత పాకిస్తాన్ చర్చల ప్రతిపాదనతో ముందుకు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ దాడులకు భారతదేశం బాంబులతో ప్రతిస్పందించిందని తెలిపింది.
ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌ను సైనికంగా, రాజకీయంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బశామని భారత విదేశాంగ తెలిపింది. ఇక ‘భారతదేశం మధ్యవర్తిత్వానికి లొంగదు’ అని పేర్కొంది.
కాగా, ప్రధాని మోడీ త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాలి. సాయంత్రం 6.30 గంటలకు ఆర్మీ, వైమానిక దళ అధికారులతో సంయుక్త సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఈ సమావేశంలో డీజీఎంఓ, నేవీ, వైమానిక దళ అధికారులు పాల్గొంటారు.