Director Shankar | డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా…?

Director Shankar | డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా…?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే.. ఏ స్టార్ హీరో అయినా కథ ఏంటి అనేది ఆలోచించకుండా ఎస్ చెప్పడానికి రెడీగా ఉండేవారు. ఇదంతా గతం. కాలం మారింది.. ఇప్పుడు వర్తమానంలో శంకర్ కు అలాంటి పరిస్థితి లేదు. శంకర్ సినిమా చేద్దామా అని అడిగినా.. ఏ హీరో డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఏ నిర్మాత ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పారట ఓ నిర్మాత. అయితే.. ఆ నిర్మాత శంకర్ కు కండీషన్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ నిర్మాత ఎవరు..? ఆయన పెట్టిన కండీషన్ ఏంటి..?

సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని దర్శకధీరుడు రాజమౌళి కంటే ముందు పెంచిన గ్రేట్ డైరెక్టర్ శంకర్. టెక్నాలిజినీ బాగా వాడి.. వావ్ అనిపించే విజువల్స్ తో సినిమాలు తీసి అద్భుతాలు చేశారు. ఇంకా చెప్పాలంటే.. ఓ టైమ్ లో ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ.. అద్భుతం అనిపించే విజువల్స్ తో కొత్త ప్రపంచాన్ని తెర పై ఆవిష్కరించి ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేవారు. అయితే.. ఇప్పుడు శంకర్ జాతకం ఏమాత్రం బాలేదు. కంటెంట్ లో బలం లేకపోవడం వలన ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి.

శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ రెండు సినిమాలు బడ్జెట్టు పరిమితులు దాటిపోయాయి. దీంతో నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి. ఈ సినిమాకి చాలా బడ్జెట్ అవుతుందట. నిర్మాత కోసం చూస్తున్న శంకర్ కు ఇప్పుడు నిర్మాత దొరికాడట. ఇంతకీ ఎవరంటే.. సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపించే బాలీవుడ్ సీనియర్ నిర్మాత జయంతిలాల్ గద. శంకర్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ ను జయంతి లాల్ నిర్మించారు. ఇప్పుడు తన పెన్ మూవీస్ బ్యానర్ పై శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. ఆయన శంకర్ కు ఓ కండీషన్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఏంటా కండీషన్ అంటే.. ఈ మూవీకి బడ్జెట్ ఎంతో ఫిక్స్ చేసి.. ప్రొడక్షన్ షెడ్యూల్ గురించి ఓ ప్లాన్ ఇవ్వాలన్నారట. అంతే కాకుండా తను చెప్పిన బడ్జెట్ మించకుండా సినిమాను పూర్తి చేస్తానని.. అగ్రిమెంట్ మీద సైన్ చేయాలని కండీషన్ పెట్టారట. దీనికి అంగీకరిస్తే సినిమా చేయడానికి ఓకే అని జయంతిలాల్ ఆఫర్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. శంకర్ ఏ సినిమాను కూడా చెప్పిన బడ్జెట్ కు సినిమా తీయరు. బడ్జెట్ పెంచేస్తుంటారు. అందుచేత జయంతిలాల్ కండీషన్ కు శంకర్ ఓకే చెబుతాడా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.
CLICK HERE TO READ ఖైదీ 2 గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్..
