జేసీబీ ద్వారా గోతి తీసి ఖననం

జేసీబీ ద్వారా గోతి తీసి ఖననం

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, పలిమేల మండలంలోని సరిహద్దుల్లో పిడుగుపాటుకు(to thunder) 94 గొర్రెలు మృతి చెందాయి. లంకలగడ్డ గోదావరి సమీపంలో గురువారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో పిడుగు పడి 94కు పైన గొర్రెలు మృతి చెందినట్లు గొర్రె కాపర్లు(the shepherds) తెలిపారు.

మేత కోసం మహాదేవపూర్ మండలం అంబటి పెళ్లి గ్రామానికి చెందిన కాట్రేవుల సమ్మయ్య, కార్ట్రేవుల ఆది, కాట్రేవుల కతరసాల, మల్లేష్, పున్నమి చంద్రుడు గొర్రెలు మేత కోసం లింకలగడ్డ(Linkalagadda) సమీపంలోకి గోదావరి వద్ద పడుకొని పెట్టి చుట్టూ కంచె వేసి భోజనం కోసం(for food) అంబటి పెళ్ళికి ఇంటికి రాగా భోజనం అనంతరం వెళ్లి చూసేసరికి 94 గొర్రెలు భారీ వర్షానికి పిడుగుపాటుకు చనిపోయినట్టు వారు తెలిపారు.

తమ వృత్తి గొర్రె కాపర్లమనీ, మొత్తం గొర్లు చనిపోవడంతో వీధిన పడ్డామని ప్రభుత్వం(government) ఆదుకోవాలని కోరుతున్నారు. సంఘటన స్థలానికి జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి, మండల అధికారి బీ రాజబాబు, మహాదేవపూర్ తహసీల్దార్ రామారావు(Tahsildar Rama Rao) సందర్శించి సంఘటన పోస్ట్మార్టం, పంచినామా నిర్వహించి జేసీబీ ద్వారా గోతి తీసి ఖననం చేశారు. సుమారు పిడుగుపాటుకు రూ.10 లక్షల న‌ష్టం జరిగినట్టు గొర్రె కాపర్లు తెలిపారు. తమకు నష్టపరిహారం చెల్లించాల‌ని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply