Died | విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతి

Died | ఆరిలోవ, విశాఖపట్నం, ఆంధ్రప్రభ : గ్రేటర్ విశాఖపట్నం 13వ వార్డు ఆరిలోవ శివాజీ నగర్ -2 సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సందక ఉదయ్ కుమార్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా ముడసర్లోవ రోడ్లో విధులు నిర్వర్తిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలారు. తోటి సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పండగ రోజు ముందు విషాద ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులలో విషాదఛాయలు అలుముకున్నాయి.
