పరుగులు పెట్టిన భక్తులు… నిలిచినపూజలు..

పరుగులు పెట్టిన భక్తులు… నిలిచినపూజలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎర్గాటుపల్లి గుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) దేవాలయంలో ఈ రోజు నాగుపాము తీవ్ర కలకలం రేపింది. పవిత్ర దీపావళి అమావాస్య కావడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నాగుపామును చూసి తీవ్రభయాందోళన చెందారు.

ఆలయ పూజారి వేదం వెంకటనారాయణ(Vedam Venkata Narayana) ఆధ్వర్యంలో ప్రజలు భక్తులతో కలిసి పామును బయటికి పంపించే ప్రయత్నం చేసినా సాయంత్రం వరకు దేవాలయంలోనే పాము ఉండడంతో భక్తులు పూజలు చేయకుండానే వెనుతిరిగారు. పూజారి, ప్రజలు పామును బయటకి పంపే ప్రయత్నాలు చేశారు.

Leave a Reply