Devotees | ఆరుద్ర నక్షత్ర పూజలు

Devotees | ఆరుద్ర నక్షత్ర పూజలు

  • శివనగర్ రామాలయానికి పోటెత్తిన భక్తులు

Devotees | కరీమాబాద్ (వరంగల్ ఈస్ట్), ఆంధ్రప్రభ : ఆరుద్ర నక్షత్రంను పురస్కరించుకొని శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ దేవాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వర స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి ఈ రోజు భక్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఉదయం నుండే భక్తులు శివనగర్‌లోని రామాలయం చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి చింతం యాదగిరి, వడ్నాల సదానందం, శ్రీరామ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply