వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
స్వామివారి కల్యాణోత్సవం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణం లోని డ్రైవర్స్ కాలనీ (కనేకల్ క్రాస్)లో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో, నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఉండబండ వో కే పద్మనాభశాస్త్రి, వేద పండితులు తెల్లవారు జామున మకర లగ్నం నందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు.
వేదపండితులు వేదమంత్రోచ్చారణాలతో, విశేష పూజల నిర్వహించి, స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తినిపించడానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బలిహరణ, పూర్ణహుతి, మంత్రపుష్పం, మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
