Development | ప్రాణాలకు భద్రతే ప్రథమ లక్ష్యం

Development | ప్రాణాలకు భద్రతే ప్రథమ లక్ష్యం
అంకుసాపూర్ మూల మలుపు వద్ద ప్రమాదకర చెట్ల తొలగింపు
పనులు ప్రారంభించిన నూతన సర్పంచ్ అంచె శ్రీనివాస్ రెడ్డి
Development works | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలోని మూల మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్లు (Huge trees) ప్రమాదకరంగా మారడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించిన నూతన సర్పంచ్ అంచె శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా చెట్ల తొలగింపు పనులను ప్రారంభింపజేశారు.
రోజురోజుకు రోడ్డు (road) పై ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు, రైతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జేసీబీ సహాయంతో చెట్లను తొలగిస్తూ రహదారిని సురక్షితంగా మార్చే దిశగా చర్యలు చేపట్టారు.
ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజల భద్రతే నా ప్రథమ బాధ్యత అన్నారు. అంకుసాపూర్ గ్రామంలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను (Development works) పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు కట్టుబడి, మాటలకే పరిమితం కాకుండా పనులతోనే నాయకత్వాన్ని చూపిస్తున్న సర్పంచ్ అంచె శ్రీనివాస్ రెడ్డి చర్యలకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, రహదారుల భద్రత, మౌలిక వసతుల కల్పనలో ఇకపై మరింత వేగంగా పనులు జరుగుతాయని గ్రామంలో విశ్వాసం పెరుగుతోంది.
