అభివృద్ధి నా లక్ష్యం… మీ ఆశీర్వాదం కావాలి

జైనూర్, ఆంధ్రప్రభ : గత పంచాయతీ ఎన్నికల్లో 94 ఆక్ట్ కారణంగా తాను పోటీ చేయలేకపోయానని, ఆ సమయంలో తన కోడలు పోటీ చేసి ప్రజలు ఆమెను గెలిపించారని సర్పంచ్ అభ్యర్థి కుమ్ర భీమ్రావు తెలిపారు. ఇప్పుడు 94 ఆక్ట్ తొలగించడంతో తన‌కు అవకాశం దక్కిందని, ఈసారి ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. తాను గెలిస్తే బండేర్ పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తానని భీమ్రావు హామీ ఇచ్చారు.

భీమ్రావు మాట్లాడుతూ.. గతంలో తన కోడలు సర్పంచ్‌గా ఉన్నప్పుడు కూడా తాను పూర్తిగా సహకరించానని, పంచాయతీలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, ఆశ్రమ పాఠశాల ఏర్పాటు వంటి పనులు జరగడానికి కృషి చేసినట్లు గుర్తుచేశారు. తోడు, తాను VTDA అధ్యక్షుడిగా మంత్రులను, రాష్ట్ర శాఖాధికారులను కలిసి పంచాయతీ అభివృద్ధికి అనేక పనులు మంజూరు చేయించానని తెలిపారు. తనను గెలిపిస్తే బండేర్ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని కుమ్ర భీమ్రావు ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave a Reply