పాలకవర్గం సభ్యుల సహకారంతో అభివృద్ధి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పాలకవర్గం సభ్యులు గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిపెద్దజట్రం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిదృష్టిలోఉంచుకొని విద్యుత్ తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తాననిఅన్నారు. గ్రామంలో ప్రతి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
ప్రజలు అభివృద్ధికి సహకరించాలని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలన్నారు. ఆయా కాలనీలలో వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తానని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గన్ని బ్యాగులు వినియోగిస్తూ కాలుష్యాన్ని నివారించాలని కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా నిధులతో గ్రామంలో నెలకొన్న సమస్యలు దశలవారీగా పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి దశకు తీసుకువెళ్తానన్నారు. అనంతరం నూతనంగా డ్రైనేజీలు నిర్మించేందుకు, నూతనంగా కుళాయిలు తీసుకునేందుకు తదితర పనులు చేపట్టేందుకు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వాతి పవన్ కుమార్ పంచాయతీ కార్యదర్శి భవిత వార్డు సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
