మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడతాం…

మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడతాం…

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మహిళలు అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటుకు కృషి చేస్తామని సర్పంచ్ ఎర్రవల్లి కృష్ణవేణి నరేష్ రావు పేర్కొన్నారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామంలో సర్పంచ్ ఎర్రవెల్లి కృష్ణవేణి నరేష్ రావు అంగన్వాడి సెంటర్ కు వాటర్ కనెక్షన్ పర్యవేక్షించారు. అనంతరం అక్కడున్నటువంటి మహిళలతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. మహిళలకు ఏ రంగంలో ఆసక్తి ఉందో దాని తగ్గట్టుగా శిక్షణ కార్యక్రమం మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేస్తానని ఆమె తెలిపారు.

మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, ఆర్థికంగా మహిళలు అభివృద్ధి సాధించాలని ఆమె హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అర్హులైన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా శిక్షణ కార్యక్రమం గురించి పంచాయతీ పాలకవర్గంతో చర్చిస్తానని ఆమె తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి గ్రామంలో నైపుణ్యం శిక్షణ కేంద్రం ఏర్పడేలా చర్యలు చేపడతానని సర్పంచ్ కృష్ణవేణి నరేష్ రావు తెలిపారు.

Leave a Reply