సూరారం పాఠశాలలో విద్యా–క్రీడా అభివృద్ధికి శ్రీకారం

సూరారం పాఠశాలలో విద్యా–క్రీడా అభివృద్ధికి శ్రీకారం

ఎండపల్లి ,ఆంధ్ర ప్రభః ఎండపల్లి మండలం పరిధిలోని సూరారం గ్రామ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. విద్యార్థుల కోసం స్టూడెంట్ క్యాలెండర్ ప్రారంభోత్సవంతో పాటు క్రీడా దుస్తుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు ఎస్ సంతోష్ కుమార్, బి శ్రీదేవి వారి ఆర్థిక సహకారంతో జరిగింది.మండల స్థాయిలో తొలిసారిగా కరాటే శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన వాటర్ ప్యూరిఫైయర్, కంప్యూటర్లు, పిల్లల వినోదానికి జారుడు బల్ల, అలాగే పక్క గ్రామాల నుంచి విద్యార్థులు రావడానికి రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.


కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడిపల్లి కొమురమ్మ, అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్ ఉరుమెట్ల మంగ, గోడిశెలపేట గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత, గణేష్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply