మంచిర్యాల, జూన్ 12 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల (Mancherial) శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు (Prem Sagar Rao) పట్టణ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు, పట్టణ సుందరీకరణ పనులకు చర్యలు చేపట్టారు. రోడ్డు విస్తరణ (Road widening) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయ సముదాయ భవనాన్ని తొలగించేందుకు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.
బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు పాత్రికేయుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. దీంతో పట్టణంలోని గంగారెడ్డి రోడ్డులో విశ్వనాధ ఆలయ సముదాయ షాపింగ్ కాంప్లెక్స్ (Shopping complex) భవనాన్ని కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమైంది. గత కొన్ని నెలలుగా రోడ్డు విస్తరణ పనులకు అంతరాయం వాటిల్లగా.. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన అనుమతి వలన తిరిగి ప్రారంభమైన పనులతో నూతన అభివృద్ధి జరుగుతుందని పట్టణ ప్రజల ఆశలు చిగురుస్తున్నాయి.
విద్యాభ్యాసం చేసిన పాఠశాల రుణం తీర్చుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, 12 జూన్ ఆంధ్రప్రభ : మంచిర్యాల శాసనసభ్యులుగా రెండుసార్లు పరాపజయం పొంది చివరిగా మూడో ప్రయత్నంలో విజయం సాధించి మంచిర్యాల ((Mancherial) నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అయితే ఎమ్మెల్యే (MLA) హోదాలో మొదటిసారిగా లక్షెట్టిపేట (Luxettipet)కు వెళ్లినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ… బాల్యంలో చదువుకున్నటువంటి లక్షెట్టిపేట ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పునరుద్ధరిస్తానని మాటిచ్చారు.
ఇచ్చిన మాట చొప్పున ఏడాది గడవకముందే ప్రభుత్వ పాఠశాల భవనాన్ని సుందరీకరణ పనులు జిల్లా కలెక్టర్ సహకారంతో గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వం ఎమ్మెల్యేతో విద్య అభ్యసించినటువంటి స్నేహితులతో కలిసి పాల్గొని ఉత్సాహంగా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట ప్రజలు ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాల భవనాన్ని అభివృద్ధి చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.
