WPL 2025 | టాస్ ఢిల్లీదే…
- యూపీ బోణీ కొట్టేనా !?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. హోరాహోరీగా సాగుతన్న మ్యాచ్‌లు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ, ముంబై, ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో తలా నాలుగు పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఈ మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
కాగా, నేటి మ్యాచ్ లో బెంగళూరు వేదికగా.. ఢిల్లీ క్యాపిటల్స్ – యూపీ వారియర్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థాన్ని పట్టేయాలని ఢిల్లీ భావిస్తుండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూపీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది.
ఈ క్రమంలో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుని.. యూపీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఎలాగైనా గెలవాలనే తపనతో యూపీ జట్టు బరిలోకి దిగనుంది.
తుది జట్లు :
యుపి వారియర్జ్ ఉమెన్ : కిరణ్ ప్రభు నవ్‌గిరే, దినేష్ వృందా, దీప్తి శర్మ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, శ్వేతా సెహ్రావత్, గ్రేస్ హారిస్, చినెల్లే హెన్రీ, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, క్రాంతి గౌడ్, సైమా ఠాకూర్.
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ : షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాసెన్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, అరుంధతి రెడ్డి.
జట్టు మార్పులు:
యుపి వారియర్జ్ మహిళలు : ఒక మార్పు – రాజేశ్వరి గయాక్వాడ్ స్థానంలో సైమా ఠాకోర్ వచ్చింది.