గెస్ట్ లెక్చరర్ల సేవలు కొనసాగించాలి

గెస్ట్ లెక్చరర్ల సేవలు కొనసాగించాలి

డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డా. కొర్ర ఈశ్వర్ లాల్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ డిగ్రీ కళశాలలో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించాలని ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డా. కొర్ర ఈశ్వర్ లాల్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ, పి.జి. కళాశాల, కొండనాగుల ప్రిన్సిపల్ కు వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షల సమయం దగ్గరగా ఉన్నప్పటికీ, గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించకుండా, “బోధిస్తేనే వేతనం” విధానాన్ని అనుసరిస్తున్న అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. “సంవత్సరంలో 7 నెలలు పనిచేయించుకొని అకాడమిక్ ఇయర్ చివరిలో అర్తాంతరంగా మా సేవల్ని నిలిపివేయడం వల్ల వేరే పని వెతుక్కోలేక మేము ఆర్థికంగా నష్టపోవడమే కాక మానసిక క్షోభకు గురౌతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతూ, 12 నెలల కన్సాలిడేటెడ్ పే వేతనంతో గెస్ట్ లెక్చరర్ల సేవలను రెన్యువల్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలరాజు, కళాశాల అధ్యక్షుడు డా. శివ కుమార్, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, ట్రెజరర్ కె. వెంకట్ స్వామి, ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply