సాయుధ పోరాట యోధుడి వర్ధంతి
జనగామ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా దేవరప్పుల మండలం కడవెండి గ్రామంలో బీసీ జేఏసీ జనగామ జిల్లా(BC JAC Janagama District) నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు విప్లవ సింహం నల్ల నరసింహులు 32వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ జనగామ జిల్లా నాయకులు దూడల సిద్దయ్య గౌడ్, జాయ మల్లేష్ కురుమ(Jaya Mallesh Kuruma), డాక్టర్ మాచర్ల బిక్షపతి మాట్లాడుతూ .. “తెలంగాణలో రైతాంగ హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన నల్ల నరసింహులు బీసీల గౌరవం, రైతు హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పోరాడిన మహానుభావుడు. ఆయన చూపిన మార్గం ఈరోజు యువతకు స్ఫూర్తిదాయకం. బీసీల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం(Social Equality) కోసం నల్ల నరసింహులు త్యాగాలు మరువరాని అధ్యాయాలు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొలిపాక నరసింహులు, సంగి వెంకన్న, దొడ్డి భిక్షపతి, బెల్లి సోమయ్య, నల్ల వీరస్వామి, బిట్ల రామచోక్కం, రేషపెల్లి కృష్ణ మూర్తి, మేడవేని సోమయ్య, కొంగళ్ళ యాకయ్య, సోమేష్, ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.

