హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూరాల ప్రాజెక్ట్ ( jurala project ) డేంజర్ ( danger)!పరిస్థితుల్లో ఉంది. డ్యామ్‌కు ) dam) ఉన్న 9వ గేటు రోప్(Rope ) తెగిపోయింది. అలాగే 12, 16 గేట్ల రోప్‌లు చాలా బలహీనంగా ఉన్నాయి. ఎప్పుడైనా తెగిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బుధవారం నాడు జూరాల ప్రాజెక్ట్ లోకి 95,119 క్యూసెక్కులు నీరు వస్తుంది. దీంతో అధికారులు అప్రమతమై 12 గేట్లను ఎత్తివేశారు. ఈ క్రమంలో 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోయింది.
దీంతో అధికారులు అప్రమత్తమై అన్ని గేట్లను పరిశీలించగా 12, 16 గేట్ల రోప్ బలహీనంగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కర్ణాటక, మహారాష్ట్రలో గత వారం రోజులు భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జూరాల ప్రాజెక్టు కు భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
. అయితే ఈ సీజన్ లో ఇప్పటికే పలుమార్లు జూరాల గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన ప్రవాహాన్ని కృష్ణ నదిలోకి వదులుతున్న విషయం తెలిసిందే. 95,119 క్యూసెక్కుల వరద నీరు రావడంతో దిగువకు మొత్తం 96,172 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్‌వే ద్వారా 63,696 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 30,422 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.010 టీఎంసీల నీరు నిల్వ ఉంది.