Custody | 40 గ్రాముల కొకైన్ సీజ్..

Custody | 40 గ్రాముల కొకైన్ సీజ్..

రైల్వే ఉద్యోగితో పాటు ముగ్గురు అరెస్ట్

Custody | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. మోకిల ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 40 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వ్యక్తి రైల్వే శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కారులో డ్రగ్స్ తరలిస్తూ విక్రయిస్తున్న సమయంలోనే అతన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో గూగుల్‌లో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పాటు మరో వ్యాపారవేత్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply