- చాహల్ హాట్రిక్ వికెట్
చెన్నై: చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడుతున్న సీఎక్సే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్… చెన్నై జట్టును అద్భుతమైన రీతిలో కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లు ఆది నుంచే చెలరేగడంతో, సీఎస్కే జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది.
అయితే, సామ్ కర్రాన్ ( 47 బంతుల్లో 88), డెవాల్డ్ బ్రెవిస్ (26 బంతుల్లో 32) దంచికొట్టారు. ఆ తర్వాత మళ్లీ కోలుకున్న పంజాబ్ వికెట్ల కోత మోదలు పెట్టింది. దాంతో సీఎస్ కే 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది.
కాగా, చెన్నై బ్యాటర్లలో సామ్ కర్రన్, డెవాల్డ్ బ్రెవిస్ మినహా మరే ప్లేయర్ కూడా 20కి పైగా పరుగులు సాధించలేదు. ఇక పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/32) 19వ ఓవర్లో నాలుగు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ రెండేసి వికెట్లు తీయగా… అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక ప్లేఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుతున్న పంజాబ్.. 191 పరుగుల విజయ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించనుంది.