Criticisms | అవినీతిపరులతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెబుతాడా..?

Criticisms | అవినీతిపరులతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెబుతాడా..?
Criticisms | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన బీఆర్ఎస్‌లో చేరే దిశగా అడుగులు వేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన, బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
ఈ పరిణామాలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని వదిలి, కేసీఆర్ విష కౌగిలిలోకి వెళ్లారని మండిపడ్డారు.
పదేళ్ల పాటు కేసీఆర్ పాలనను రాక్షస, అవినీతి పాలనగా విమర్శించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు ఆయనతో కలిసి పని చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. “అవినీతిపరులతో కలిసి పని చేయమని ఏ దేవుడైనా చెబుతాడా?” అంటూ నిలదీశారు. ఇక కేసీఆర్ తిరిగి రావాలని ప్రజలు కోరుకోవడం లేదని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి.
