Criticisms | రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిన కాంగ్రెస్

Criticisms | రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిన కాంగ్రెస్
Criticisms | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీపై ఆయన పట్టు కోల్పోయిందని, పార్టీని ఖతం చేసే దిశగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడుతూ… తన వయసును గౌరవించి ‘అన్న’ అని సంబోధిస్తారని అన్నారు. కేసీఆర్కు ప్రజలంటే గౌరవం ఉందని, రేవంత్ రెడ్డికి అలాంటి గౌరవం లేదని విమర్శించారు. తాను బీఆర్ఎస్లో చేరడం ప్రజల కాంక్షతోనే జరుగుతోందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
