Criticisms | నియోజకవర్గాల పునర్విభజన అసలైన సమస్య..

Criticisms | నియోజకవర్గాల పునర్విభజన అసలైన సమస్య..

సోనియా గాంధీ

Criticisms | న్యూఢిల్ల- ఆంధ్రప్రభ : మహిళా రిజర్వేషన్ సమస్య కాదు, నియోజకవర్గాల పునర్విభజన అసలైన సమస్య అని కేంద్రంపై సోనియా గాంధీ విమర్శలు చేశారు. ఒక పత్రిక వ్యాసం లో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను ఆమె అత్యంత ప్రమాదకరమైనది అని రాజ్యాంగంపై దాడి అని అభివర్ణించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం కుల గణనను ఆలస్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడాన్ని కూడా ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ కుల గణన కోసం పిలుపునిచ్చిందని అప్పుడు మోదీ దానిని విమర్శించేవారు, కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా దానిని ప్రకటించారని ఆమె అన్నారు.

Leave a Reply