ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో నేరాల నియంత్ర‌ణ‌

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో నేరాల నియంత్ర‌ణ‌

  • సరిహద్దు ప్రాంతాలలో అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి
  • సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

హుజూర్‌నగర్, (ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా) ఆంధ్రప్రభ : రాష్ర్ట స‌రిహ‌ద్దు ప్రాంతంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా వేస్తున్నామ‌ని ఎస్పీ న‌ర‌సింహ(SP Narasimha) తెలిపారు. ఈ రోజు హుజూర్ నగర్ మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు పోలీస్ స్టేషన్‌లను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాష్ర్టంలోకి గంజాయి, ఇత‌ర మ‌త్తు ప‌దార్థాలు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు.

నేరాలు అదుపున‌కు ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావ‌ల‌సి ఉంద‌ని, అక్ర‌మ ర‌వాణా, గంజాయి ర‌వాణా, మ‌త్తు ప‌దార్థాల(Narcotics) విక్ర‌యం త‌దిత‌ర నేరాల‌ను అదుపు చేయ‌డానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల్సిందిగా కోరారు. హుజూర్ నగర్(Huzur Nagar) సర్కిల్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాలలో అక్రమ వ్యాపారాల రవాణా నియంత్రణకు పటిష్టమైన బందోబస్తుతో చెక్ పోస్ట్(Check Post) లను ఏర్పాటు చేసామన్నారు.

పోలీస్ స్టేషన్‌(Police Station)కు వచ్చే ప్రతి పిర్యాదు పై తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ నరసింహకు సీఐ చరమందరాజు స్వాగతం పలికి ఎస్ఐ మోహన్(SI Mohan) ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరేడ్‌ను నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో మొక్కను నాటి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. పట్టణాల్లో, పల్లెల్లో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించే ఎటువంటి వ్యక్తులనైన, చర్యలనైన సహించేది లేదన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ భరోసా కార్యక్రమాలు చేపడుతూ సైబర్ క్రైమ్(Cyber ​​Crime), డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్ ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజలకు, విద్యార్ధులకు, యువతీ, యువకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐ చరమందరాజు(CI Charamandaraj), హుజూర్ నగర్ ఎస్ఐ బండి మోహన్, మఠంపల్లి ఎస్ఐ బాబు, గరిడేపల్లి ఎస్ఐ నరేష్, పాలకీదు ఎస్ఐ రవీందర్ నాయక్, పాలకీడు ఎస్ఐ కోటేశు, ఎఎస్ఐ బలరాంరెడ్డి, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది(Police Staff) పాల్గొన్నారు.

Leave a Reply