కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శతక గర్జన చేశాడు. అద్భుత ప్రదర్శన కనబర్చిన హిట్ మ్యాన్.. ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును ఊచకోత కోశాడు. 76 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 102 సెంచరీ నమోదు చేశాడు. గతంలో పేలవమైన ఫామ్ కు.. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీతో విమర్శకుల నోటికి తాళం వేశాడు.
ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్యంలో.. తొలుత ఓపెనర్ సుభమన్ గిల్ తో కలిసి 136 పరుగుల బలమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఓపెనర్లిద్దరూ చెలరేగుతుండగా.. శుభమన్ గిల్ (60) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ (5) మరో సారి నిరాశ పరిచాడు.
ప్రస్తుతం క్రీజ్ రోహిత్ (102), శ్రేయస్ అయ్యార్ (13) ఉన్నారు. భారత్ స్కోర్ 25.4 ఓవర్లకు 186/2.