CPI 100 years | పేదలకు అండగా కమ్యూనిస్టు…

CPI 100 years | పేదలకు అండగా కమ్యూనిస్టు…

CPI 100 years | గట్టుప్పల, ఆంధ్రప్రభ : పేదలకు అండగా నిలబడిన పార్టీ సీపీఐ అని జిల్లా సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం( Nellikanthi) అన్నారు. సీపీఐ100 సంవత్సరాలు(CPI 100 years) పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఈనెల 26న నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార బస్సు జాత ఈ రోజు మండల కేంద్రానికి చేరుకుంది.

మండల కమ్యూనిస్టు నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ(bike rally)తో స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం మరింత పెరగనుందని, ప్రపంచం మొత్తం కమ్యూనిస్టుల నాయకత్వాన్ని కోరుకుంటుందని అన్నారు. దేశంలో స్వాతంత్రం (independence) వచ్చాక పేద ప్రజలకు ప్రభుత్వ భూములను పంచాలని పోరాడిన పార్టీ సీపీఐ అని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాల కోసం నిరంతరం సీపీఐ పోరాటాలు నిర్వహించిందని అన్నారు. రాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టుల కోసం సీపీఐ చేసిన అలుపెరుగని పోరాటాలతోనే సాగునీటి ప్రాజెక్టులు సాధించామని అన్నారు. నిజాం సర్కార్(Nizam government) నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సీపీఐ సమరశీల పోరాటాలు చేసిందన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ(Bala Narasimha), ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, తీర్పారి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి భీమనపల్లి రమేష్, చాపల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, జగన్, రాపోలు సత్తయ్య, యాదయ్య, లక్ష్మయ్య, ముత్యం, శేఖర్, కారింగు శ్రీను, గోస్కొండ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply