రోడ్డెక్కిన పత్తి రైతు… నిలిచిన కొనుగోళ్లు…

రోడ్డెక్కిన పత్తి రైతు… నిలిచిన కొనుగోళ్లు…
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : పత్తిలో తేమశాతం నిబంధన పేరిట కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) కొర్రీలు విధిస్తూ పత్తిబండ్లను వెనక్కి పంపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకురాగా, 12 శాతం తేమ దాటిన పత్తిని కొనుగోలు చేసేది లేదని నిరాకరించారు.
ప్రభుత్వం క్వింటాలు మద్దతు ధర రూ. 8,110(The support price per quintal is Rs. 8,110.) ప్రకటించగా, స్లాట్ బుకింగ్, తేమశాతం నిబంధనల కారణంగా తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సి వస్తోందని రైతులు వాపోయారు. మార్కెట్ లో పత్తి విత్తనాల కొనుగోలు నుండి, పండించిన పంట సరుకులు అమ్మే వరకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీసీఐ అధికారులను నిలదీశారు.
భారీ వర్షాలు, తుఫాను ప్రభావంగా పత్తిలో సహజ సిద్ధంగానే 20 నుండి 25% తేమ వస్తుందనీ, అధికారులు ఆంక్షలు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు అన్నారు. ఈ సందర్భంగా రోడ్డెక్కి రైతులు పత్తి పండ్లతో నిరసన తెలుపడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పత్తి కొనుగోలులను ప్రతిష్టంబన నెలకొంది.
- షార్ట్ సర్క్యూట్‌తో పత్తి బుగ్గి పాలు.. రూ. 4 లక్షల నష్టం..!

జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఏడవ్ దీపక్ తన ఇంట్లో నిల్వ చేసి ఉన్న పత్తి విలువలు మొత్తం కాలి బూడిదైంది. సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్(Kisan app slot booking) కారణంగా పత్తిని మార్కెట్లో సకాలంలో తీసుకొని వెళ్లలేదని, కొనుగోలు రైతులకు తీవ్ర జాప్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని తాను కష్టించి పండించిన 50 క్వింటాళ్ల పత్తి షార్ట్ సర్క్యూట్(50 quintals of cotton short circuit)తో పూర్తిగా కాలి బూడిద కావడం ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. ఇంట్లో సామాగ్రితో పాటు ఇల్లు కూడా కాలింది. అగ్నిప్రమాదంలో రూ. 4 లక్షల పత్తి కాలి బూడిద అయిందని దీపక్ కంటతడి పెడుతూ విలపించడం ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించింది. మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) ప్రమాద స్థలికి వెళ్లి బాధిత రైతును ఓదార్చారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. మార్కెట్లో పత్తి విక్రయించే రైతులపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.
