10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్పగెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 10వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కర్రెం చెన్నమ్మ నీలప్ప విజయం సాధించారు. కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థి మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప కి 388 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి కగ.జయమ్మ కు 350 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
