8వ వార్డులో కాంగ్రెస్ జోరుగా ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో అభివృద్ధిలో 8 వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు అభ్యర్థి జుట్ల అనిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పార్టీ నాయకులు మద్దతు దారులతో కలిసి రాఘవేంద్ర కాలనీ, శభరీ కాలనీలో భారీ ర్యాలీ తో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఓటర్లను కలుసుకొని మద్దతు కోరుతూ ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చారు. అభివృద్ధి చేయడం నా బాధ్యత మంత్రి సహకారంతో అభివృద్ధిలో 8వ వార్డును ముందంజలో ఉంచుతానని తనకు అండగా నిలిచి ఆశీర్వదించి ఓటు వేయాలని అభ్యర్థించారు.

అధికార పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని గుర్తు చేశారు .ప్రతిపక్ష పార్టీల వల్ల ఎలాంటి లాభం లేదన్నారు.అలాంటి వారి మాయమాటలు నమ్మి మోస పోతే అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి పోవడం ఖాయమన్నారు. ప్రస్తుతం మంత్రి సహకారంతో మక్తల్ పట్టణ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికార పార్టీకి అధికారం ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని మీ అందరి అండ నాకు కావాలని ఆమె ఓటర్లను కోరారు. 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్గా తనను గెలిపించవలసిందిగా జుట్ల అనిత ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కావలి సునీత, రాజ్యలక్ష్మి, కావలి ఆంజనేయులు, కే .చెన్నయ్య గౌడ్,ఆర్ఎంపి. శంకర్, నరేందర్ ,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply