Congress | జ్వరంతో ఆస్పత్రిలో చేరగా…

Congress | జ్వరంతో ఆస్పత్రిలో చేరగా…

Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత్రి సోనియా గాంధీ ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ వైద్యులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ఈ నెల 24వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో జ్వరంతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Leave a Reply