Congress | బీజేపీ జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్ట్

Congress | బీజేపీ జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్ట్

  • సీఎం జిల్లా పర్యటన సందర్భంగా అరెస్ట్
  • బీజేపీ నేతల అక్రమ నిర్భంధాలు…
  • హౌస్ అరెస్ట్ లపై జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆగ్రహం
  • కనీసం బయటికి వెళ్ళే హక్కు కూడా లేదా ?

Congress | కరీమాబాద్, ఆంధ్రప్రభ : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ను పోలీసులు (Police) హౌస్ అరెస్టు చేశారు. ఈసందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ… కాంగ్రెస్ మంత్రుల కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని గంట రవికుమార్ అన్నారు.

    వరంగల్ జిల్లా నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజాపాలన సభకి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు, గృహ నిర్బంధాలు చేయటంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
    ఈరోజు తెల్లవారుజాము నుండి బీజేపీ (BJP) నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తారా ? అంటూ మండిపడ్డారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి కూడా అనుమతి లేదా? అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని రవికుమార్ దుయ్యబట్టారు.

    బీజేపీ నేతలంటే సర్కారుకు (Government) ఎందుకింత భయమో చెప్పాలన్నారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులను గృహనిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని… బీజేపీ నేతలపై ప్రభుత్వం జులుం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు.

    అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని గంట రవికుమార్ అన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని… సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ (Congress) పార్టీకి కచ్చితంగా బుద్ది చెబుతారన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులను జిల్లా అధ్యక్షులు ఖండించారు.

    Leave a Reply