Congress l గెలుపు దిశగా దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న..

Congress l గెలుపు దిశగా దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న..

1 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న

Congress l మోత్కూర్ , ఆంధ్రప్రభ: మోత్కూరు మున్సిపాలిటీలోని 1 వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లెర్ల వెంకన్న ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ… గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. సామాజిక సేవకునిగా కొనసాగుతున్న తనకు …ఒక్కసారి అవకాశం కల్పించి …ఓటర్ మహాశయుల ఆశీర్వాదాలతో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే 1వ వార్డును తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.

ఈనెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో తనను గెలిపించాలని ప్రచారంలో విజ్ఞప్తి చేస్తున్నారు. గెలిపిస్తే వార్డులోని సమస్యలు అన్నింటిని పరిష్కరించడంతో పాటు …అదనపు నిధులు తెచ్చి 1 వ వార్డును మోత్కూర్ మున్సిపాలిటీలోనే ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పి స్వామి రాయుడు, ఎండి మహమ్మద్ అలీ, కళ్లెం నర్సయ్య, సోమిరెడ్డి , ఇక్కిరి నాగరాజు, సిపిఐ నాయకులు పోచం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply