Congress l నహీద బేగం ను అభివృద్ధి కోసం గెలిపించండి..

Congress l నహీద బేగం ను అభివృద్ధి కోసం గెలిపించండి..

Congress l మక్తల్,ఆంధ్రప్రభ: మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి కోరుకునే వారంతా 11వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నహీదా బేగం ను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు మంజూర్ కోరారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం రోజు వార్డు పరిధిలో ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంజూర్ మాట్లాడుతూ వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది అన్నారు .ప్రజల మద్దతుతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారని ఎన్నికల్లో కచ్చితంగా నహీదా బేగం 11వ వార్డు కౌన్సిలర్ గా గెలవబోతున్నారని అన్నారు .వార్డు పరిధిలో సిసి రోడ్లు మురుగు కాలువలు మంచినీటి వ్యవస్థ విద్యుత్ సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. వార్డులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని అన్నారు .ప్రతిపక్షాల మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు .11న జరగనున్న ఎన్నికల్లో హస్తము గుర్తుకు ఓటు వేసి నహీదా బేగంను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూరుద్దీన్,అబ్దుల్ రెహమాన్ ,అప్రోజ్ , షాబుద్దీన్, బాలరాజు,సద్దాం, యాసీన్ ,రహీం ,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply