Complaint | పలు విభాగాల్లో రికార్డుల పరిశీలన

Complaint | పలు విభాగాల్లో రికార్డుల పరిశీలన
Complaint | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుగుతున్నాయి.
టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఆర్‌ఐ ఇంజనీరింగ్, అకౌంట్స్, పారిశుద్ధ్యం, బిల్ కలెక్టర్ విభాగాలతో పాటు పలు శాఖల్లో సుమారు 15 మంది ఏసీబీ అధికారులు విడివిడిగా తనిఖీలు చేపట్టారు. పలు విభాగాల్లో జరిగిన అవినీతి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోదాల సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా, వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. మరోవైపు, మున్సిపల్ కమిషనర్ కె. నరసింహ నివాసంలో కూడా ఏసీబీ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడులపై మరికొద్ది గంటల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.
