Competitions | నేషనల్ కబడ్డీ టోర్నీకి సిద్ధం

Competitions | నేషనల్ కబడ్డీ టోర్నీకి సిద్ధం

  • 45 బాలికల జట్లు సందడి
  • ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Competitions | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ – 14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు(Kabaddi competitions) నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు.2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(School Games Federation of India), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి 19వ తేదీ నుండి ఐదు రోజులపాటు జరిగే పోటీల నిర్వహణపై.. పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశం అయ్యారు.

సమావేశంలో పాల్గొన్న గుడివాడ మున్సిపల్(Gudivada Municipal) స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్… పోటీల నిర్వహకులతో ఎమ్మెల్యే రాము పలు అంశాలపై మాట్లాడారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా గుడివాడలో జరుగుతున్న పోటీల(Competition organizers)కు వచ్చే క్రీడాకారులు, కోచ్ లు, ఫెడరేషన్ పెద్దలకు ఇచ్చే ఆతిథ్యం, రవాణా, వసతి ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్షించారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ….. జాతీయస్థాయి పోటీలు నిర్వహించే అవకాశం గుడివాడకు రావడం సంతోషకరమని హర్షం వ్యక్తం(Expressing joy) చేశారు. పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 45 జట్లు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు తలేత్తకుండా పోటీల నిర్వహణపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం సహకారంతో నిర్వహించే పోటీల విజయవంతానికి క్రీడాభిమానులు, దాతలు తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే రాము(MLA Ramu) విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోపు వచ్చే తుది జట్ల జాబితా అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎం.ఈ ప్రసాద్, జాతీయ స్థాయి పోటీల నిర్వహణ కార్యదర్శి ఎస్.గంగాధర్, కమిటీ సభ్యులు ఎన్.రవిబాబు ,బి.అనిల్,యం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply