కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
- ముధోల్ సిఐ మల్లేష్
- సరైన పత్రాలు లేని 36 బైకులు, ఆరు ఆటోల పట్టివేత
బాసర, ఆంధ్రప్రభ : ప్రజల భద్రత కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ముధోల్ సీఐ మల్లేష్ (Mudhole CI Mallesh) తెలిపారు. మండల కేంద్రంలోని రవీంద్రాపూర్ కాలనీలో శుక్రవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (Community Contact Program) నిర్వహించారు. పోలీసుల తనిఖీలలో సరైన పత్రాలు లేని 36 బైకులు, ఆరు ఆటోలు పట్టుబడినట్లు సీఐ తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ప్రజల భద్రత (Public safety) కోసమేనన్నారు. చుట్టుపక్కల అనుమానితులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సీస్, ఏఎస్ఐ లు కానిస్టేబుల్ పాల్గొన్నారు.
