Committee members | హుండీ లెక్కింపు

Committee members | హుండీ లెక్కింపు
- విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ.3,72,657
Committee members | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపులో ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు (Devotees) పాల్గొన్నారు. మూడు నెలల కాల వ్యవధిలో రూ. 3 లక్షల 72 వేల 657 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ సాయన రాజేష్ తెలిపారు. కానుకల రూపంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు, ధర్మకర్తల మండలి సభ్యులు పోతురాజు, పంచమర్తి శ్రీనివాసరావు,వీరమాచనేని శైలజ, జయలక్ష్మి, దుర్గ భవాని, లోయ వాసు తదితరులు పాల్గొన్నారు.
