Committee | సమ్మెను జయప్రదం చేయాలి..

Committee | సమ్మెను జయప్రదం చేయాలి..

Committee | మర్రిగూడ, ఆంధ్రప్రభ : గురువారం రోజున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.

29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా తీసుకురావడం విద్యుత్ సవరణ చట్టం విత్తన బిల్లు ఉపసంహరించుకోవాలని ర్యాలీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 12న దేశ నలుమూలల నుంచి కార్మికులు, కర్షకులు, మహిళలు మేధావులు యువత విద్యార్థులు అందరూ ఏకమై సమ్మె సైరన్ కు సిద్ధమైరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్క నరసింహ, రామావత్ రాజు నాయక్, ఉరిపక్క లింగయ్య, పగిళ్ల రామచంద్రం, పోలేపల్లి రాములు, సిలువేరు మహేష్, మైలారం నరసింహ, సిల్వర్ వెంకటయ్య, బడే లక్ష్మీకాంత్, ఆవుల ముత్తయ్య, ఎడ్ల జంగయ్య, ఊరిపక్క అరవిందు, బొల్లెపల్లి మల్లయ్య, పాల్గొన్నారు.

Leave a Reply