మా కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కు రండి…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య మల్లు నిశ్చితార్థం ఈ నెల 26న జరగనున్న నేపథ్యంలో, భట్టి విక్ర‌మార్క దంప‌తులు ప్రముఖులను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారు.

ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, గీతా రెడ్డి దంపతులను జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

అంత‌క‌ముందు, భట్టి విక్రమార్క – మల్లు నందినీ దంపతులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్‌భవన్‌లో ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు. ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం కోసం పంపిన ఆహ్వానాన్ని గవర్నర్ స్వీకరించి, భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply