గుంటూరు యార్డులో కలెక్టర్ ఆరా

(ఆంధ్రప్రభ, గుంటూరు) : గుంటూరు మిర్చి యార్డు (Guntur Mirchi Yard) లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి గురువారం పర్యటించారు. మిర్చి యార్డులో కార్యకలాపాలు పరిశీలించారు. రైతు నుండి ఎగుమతిదారు వరకు జరిగే ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు. రైతుల శ్రేయస్సుకు సహకరించి కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. బిడ్డింగ్ రూమ్ ను పరిశీలించారు. మిర్చియార్డు లో కార్యకలాపాలను మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, యార్డు ఇన్ ఛార్జ్ సుబ్రహ్మణ్యం, వ్యాపారులు వివరించారు. మిర్చి యార్డులో రైతులు స్వయంగా విక్రయిస్తారని తెలిపారు.

ఉదయం 7 గంటల నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని అన్నారు. 415 మంది ట్రేడర్లు ఉన్నారని తెలిపారు. మార్కెట్ ధరకు అనుగుణంగా ఎగుమతి ధరలు (Export prices) ఉంటాయని వివరించారు. పంట కాలంలో రెండు లక్షల బస్తాల వరకు సరుకు వస్తుందని, మిగిలిన కాలంలో ఏబై వేల బస్తాల వరకు వస్తాయని చెప్పారు. చైనా, థాయిలాండ్, కొలంబో, ఇండోనేసియా, మలేసియా తదితర దేశాలకు ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయన్నారు. తేజ రకం ఎగుమతుల్లో ప్రధానమైనది పేర్కొన్నారు. 334, 341 రకం స్థానిక వినియోగానికి ఉపయోగిస్తారని తెలిపారు. గత ఏడాది దిగుబడులు ఎక్కువగా ఉండటం, నాణ్యత కొంత మేర తక్కువగా కావటంతో ధరలు తగ్గాయని వివరించారు. ఈ కార్యక్రమంలో యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఏ.చంద్రిక, పాల్గొన్నారు.

Leave a Reply