Collector | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

Collector | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు
Collector | మోత్కూరు,ఆంధ్రప్రభ: నేడు జరిగే మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావ్ అన్నారు. సోమవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ లో ఓటర్లు ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా చూడాలని ఒకవేళ టెండర్ ఓట్లు పడితే రీ పోలింగ్ జరిగే అవకాశం ఉంటుందని అలా జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్ల తో పాటు ఎన్నికల సిబ్బంది సైతం మొబైల్ ఫోన్ లు తీసుకెళ్లవద్దన్నారు.ఎన్నికల సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కంపార్ట్ మెంట్ లోకి వెళ్లవద్దన్నారు.పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు ,సామగ్రి తో ఆలస్యం చేయకుండా త్వరగా భువనగిరి లోని కేంద్రానికి చేరుకోవాలన్నారు. పి ఓ ,ఏ పి ఓ లు మాత్రమే రావాలని ఓ పి ఓ లు అవసరం లేదన్నారు.
12 వార్డులకు సంబంధించి 26 పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులు 26 మంది విధులు నిర్వహిస్తుండగా 6 గురు రిజర్వులో ఉంటారు.వీరితో పాటు 26 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 6 గురు రిజర్వ్ లో ఉంటారు. ఓపిఓ లు 32 మంది గాక మరో 32 మంది ని రిజర్వులో కేటాయించారు.మొత్తం పోలింగ్ ప్రక్రియ లో మొత్తం 126 మంది ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వర్తిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ తెలిపారు.17 పోలింగ్ కేంద్రాల్లో 8 మంది మైక్రో అభర్వర్లు విధులు నిర్వహిస్తారు.17 కేంద్రాలకు గాను ఒక్కొక్క కేంద్రానికి ఇద్దరు చొప్పున పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు.2 జోన్లుగా ఏర్పాటు చేసి 7 రూట్ లను నిర్వహిస్తున్నారు.26 పోలింగ్ కేంద్రాల్లో బూతుకు 26 బాక్సులతో పాటు మరో 26 బ్యాలెట్ బాక్సులు రిజర్వు ల్లో ఉంచుతారు. మున్సిపాలిటీలోని 12 వార్డుల మొత్తం ఓటర్ల సంఖ్య 14383 మంది ఉండగా,అందులో పురుషులు 7106,మహిళలు 7277 పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలీసుల బందోబస్తు తో చేరుకున్న ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 13 న భువనగిరి లోని దివ్యబాల పాఠశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఫలితాల అనంతరం ఈ నెల 16 న మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ ఛైర్మన్ పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నారు.
మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరగడానికి పోలింగ్ నిమిత్తం ఉన్నత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ సమావేశంలో ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, జిల్లా ఎన్నికల సహాయ అధికారి, మున్సిపల్ కమిషనర్ కే.సతీష్ కుమార్,రిటర్నింగ్ అధికారులు జ్యోతి, బాలాజీ నాయక్,జనార్ధన్ రెడ్డి, మంగులాల్ ,మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ ,మాస్టర్ ట్రైనర్ లు పి సుధాకర్, చిత్తరంజన్ ,సి ఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

