ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ..

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్.టి.ఆర్ గార్డెన్స్ ఎదురుగా ఖైరతాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్పొరేటర్ పి. విజయ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం (Sand Sculpture) ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆయన పి. విజయ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శిల్పి బాలాజీ రూపొందించిన సైకత శిల్పం ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను సందడిగా నిర్వహించారు.
మా కష్టాలను గుర్తించిన సీఎం – ప్రజా క్షేత్రంలో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి..
బంజారా హిల్స్, (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఫిల్మ్‌నగర్ చాంబర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు, చిత్రపురి అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ అధ్యక్షులు కానుమిల్లి అమ్మిరాజు, ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ జి. శ్రీకాంత్, సినీ టోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ.. “సినీ కార్మికుల కష్టాలను గుర్తించి, వారికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడు. ఆయన ప్రజా క్షేత్రంలో ఇంకా ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకుడిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం” అని తెలిపారు.
కార్యక్రమంలో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు బత్తుల రఘు, టీ. లలిత, సి. వేణుగోపాల్, డి. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
