Cinema | రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ – “పెద్ది” మూవీ ఫస్ట్ లుక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్సీ 16 కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, అంటే మార్చి 27 న( ఈ రోజు) విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ చరణ్ తన స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించాడు, ఇది అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

ఫస్ట్ లుక్‌లో రామ్ చరణ్ గడ్డంతో కూడిన రగ్గడ్ లుక్‌లో, గ్రామీణ నేపథ్యంలో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ‘పెద్ది’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ లుక్‌ను ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ రూపొందించారు. అలాగే ఈ సినిమా కథకు సంబంధించిన రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌ను సూచిస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా, ఉత్తరాంధ్ర పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని తెలుస్తోంది. అలాగే చరణ్ లు సినిమా ఇంటెన్సిటీని మరింత హైలైట్ చేస్తుంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *