మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కన్నప్ప. తాజాగా ఈమూవీ కొత్త టీజర్‌ను మేకర్స్ నేడు విడుదల చేశారు. 84 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో విష్ణు అద్భుతమైన నటనతో పాటు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆర్ఆర్, ఆఖరిలో ప్రభాస్ లుక్ హైలైట్ గా ఉన్నాయి
కాగా, ఇప్పటికే విడుదలైన శివ శివ శంకరా పాటకు పాజిటివ్ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.