గన్‌మెన్ కుటుంబానికి సీఐ పరామర్శ..

గన్‌మెన్ కుటుంబానికి సీఐ పరామర్శ..
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల సీఐ కార్యాలయంలో గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ, మామ కూచన జనార్ధన్ ఇటీవల మృతి చెందారు. దీంతో సీఐ దగ్గు మల్లేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడు జనార్దన్ చిత్రపటానికి సీఐ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
