Christmas Feast | ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్

Christmas Feast | ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్

  • మత సామరస్యానికి నిదర్శనంగా ప్రభుత్వ క్రిస్మస్ విందు కార్యక్రమం
  • బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్‌ను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
  • ప్రతి నియోజకవర్గానికి రూ.2 లక్షలతో క్రిస్మస్ వేడుకలు
  • విద్యే సమాజ సమస్యలకు పరిష్కారం
  • స్టేషన్ ఘన్ పూర్‌లో ఘనంగా క్రిస్మస్ ఫీస్ట్
  • స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Christmas Feast | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : కొన్ని పండుగలు కులాలకు పరిమితమై ఉంటాయని, కొన్ని మతాలు దేశాలకు పరిమితమై ఉంటాయని, అయితే క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) చెప్పారు.

ఈ రోజు స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని కే.ఆర్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం(State Government) క్రైస్తవ సోదరుల కోసం అధికారి కంగా నిర్వహించిన క్రిస్మస్ ఫీస్ట్(Christmas Feast) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డీవో వెంకన్న అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమా నంగా గౌరవిస్తూ పండుగలను అధికారికంగా నిర్వ హించడం అభినందనీయమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను సంప్రదాయబద్ధంగా, రాష్ట్ర పండుగలుగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ విధంగా పండుగలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. మత సామరస్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

యేసుక్రీస్తు సందేశాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి:

క్రైస్తవ మతం అనేది ఒక జీవన విధానాన్ని నేర్పుతుందని, యేసుక్రీస్తు(Jesus Christ) చెప్పిన ప్రేమ, క్షమ, దయ గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.2 లక్షలు(Rs. 2 lakhs) కేటాయిం చి విందు ఏర్పాటు చేయడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని పేర్కొన్నారు.

ఇతరులను నొప్పించకుండా ప్రేమను పంచుకోవడమే యేసు సందేశమని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని క్షమించే గుణం ఉండాలని, దయాగుణంతో ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత సమస్య ఎక్కువగా ఉందని, చదువు లేకపోవడం వల్ల పిల్లలు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రార్థన మందిరాల(Prayer Halls)కు వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని, స్వీయ పరిరక్షణ, మంచి అలవాట్లపై వాక్య రూపంలో వారికి అవగాహన కల్పించాలని సూచించారు. తాగుడు అలవాట్ల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.

సమాజంలో ఉన్న అనేక సమస్యలకు విద్య ఒక్కటే పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. తాండాలు, గ్రామాల్లో తాగుడు అలవాట్లను పూర్తిగా మానిపిస్తే అదే నిజమైన యేసు సేవ(Jesus Service) అవుతుందన్నారు. దేవుడి సేవలో ఉన్నవారు తాగుడుకు దూరంగా ఉండి, ఇతరులను కూడా మార్గనిర్దేశం చేస్తే సమాజానికి గొప్ప సేవకు లుగా నిలుస్తారని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్లు సదానందం, విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ రాధా కృష్ణ, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply