Chintapalli | మహిళ దారుణ హత్య

Chintapalli | మహిళ దారుణ హత్య

నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి హత్య ఉదంతం
అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య
చంపి ఊరు పక్కన ఉన్న బావిలో శవాన్ని పడేసిన నిందితుడు రాజు
మృతురాలి భర్త శ్రీను ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు
విచారణ చేయగా హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు రాజు
చింతపల్లి మండలం పాలెం తండాలో ఘటన


Chintapalli | చింతపల్లి, ఆంధ్రప్రభ : అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ మహిళను దారుణంగా హత్య (murder) చేసి బావిలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి భర్త, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చింతపల్లి మండల పరిధిలోని పాలెం తండాకు చెందిన సభావత్ జ్యోతి (Sabhavat Jyoti) (30) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన సభావట్ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో మంగళవారం రోజున ఇద్దరి మధ్య గొడవ జరిగి రాజు జ్యోతిపై దాడిచేయగా జ్యోతి మృతిచెందింది.

జ్యోతి (Jyoti) మృతదేహాన్ని ఊరి పక్కనే ఉన్న బావిలో పడవేశాడు. జ్యోతి కోసం భర్త, బంధువులు వెతకగా.. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు (police) తమదైన శైలిలో విచారణ చేయగా ఈ హత్యతో రాజుకు సంబంధం ఉందని గుర్తించి అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య (murder) విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది చింతపల్లి ఎస్సై రామ్మూర్తి పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని దేవరకొండ డిఎస్పి శ్రీనివాసరావు, నాంపల్లి సీఐ రాజు, కొండమల్లేపల్లి సిఐ నవీన్ కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని ఫైర్ ఇంజన్ సహాయంతో బావి నుండి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply